ఏపీ కరోనా అప్ డేట్: 438 పాజిటివ్ కేసులు, రెండు మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 64,236 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, 438 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 83 కొత్త కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 80 కేసులు , గుంటూరు జిల్లాలో 54, విశాఖ జిల్లాలో 40 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 14, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో 20 చొప్పున కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 589 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులవగా, ఇద్దరు మరణించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 8,78,723 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,67,445 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,202కి తగ్గింది. మొత్తం మరణాల సంఖ్య 7,076కి చేరింది.

Andhra Pradesh
Corona Virus
Update
Bulletin

More Telugu News